ముద్ర,మోత్కూర్:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో నిరుపేద కుటుంబానికి చెందిన వల్లమల పెంటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చందనంతో మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సభ్యులు దాతల సహకారంతో సేకరించిన 16,500 రూపాయల చెక్కును సోమవారం స్థానిక కౌన్సిలర్ కూర్మిళ్ల ప్రమీల రాములు, ఓ యూ జేఏసీ మాజీ చైర్మన్ మర్రి అనిల్ కుమార్ ల చేతుల మీదుగా మృతురాలి కుటుంబానికి స్వయంగా అందజేశారు. మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న, మాజీ ఎంపీటీసీ,వార్డు సభ్యులు ముద్దం జయశ్రీ,ఎడ్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు మొగుల్లపల్లి సోమయ్య,వాట్సప్ గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు,మొరిగాల శ్రీనివాస్,కారుపోతుల శ్రీనివాస్, గుంటి దేవా,బోడ బాబు రావ్,కుటుంబ సభ్యులు నర్సయ్య, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు