Take a fresh look at your lifestyle.

పండిట్ దీన దయాళ్ మానవతా వాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గొప్ప మానవతా వాది అని, ఆయన సిద్ధాంతాలు ఆచరణీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు అన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ నియోజకవర్గ మండలాల “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్” కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి “ఏకాత్మ మానవతావాదం” సిద్ధాంతం మనకు మార్గదర్శకమన్నారు. వ్యక్తి నుంచి సమాజం, సమాజం నుంచి దేశం వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ప్రతి కార్యకర్త పని చేయాలని పేర్కొన్నారు. అదే భావనతో బూత్ స్థాయిలో పని చేస్తూ ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించడం, సేవాభావంతో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం అత్యంత అవసరమన్నారు. ఈ కాయక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వక్తలుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ఇంచార్జి గోపిడి స్రవంతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి , మేడిసెమ్మే రాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.