Take a fresh look at your lifestyle.

పేదలకు ఉచిత వైద్య శిబిరాలు ఉపయోగపడాలి

  • భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

గచ్చిబౌలి, ముద్ర విలేఖరి: గచ్చిబౌలి డివిజన్ గౌలీ దొడ్డిలో రాహుల్ చాతి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు.నిరుపేదలు మెరుగైన వైద్యం చేయించుకోవాలంటే కార్పొరేట్ ఆసుపత్రులలో డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకునే స్థితిలో లేక చాలామంది పేదవారు ప్రాణాలు కోల్పోతున్నారని,ఇలాంటి హాస్పిటల్ లు ముందుకు వచ్చి ఉచిత టెస్టులు, ఉచితంగా మందులు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందిస్తున్న రాహుల్ ఆస్పత్రి యజమాన్యాన్ని అభినందిస్తూ ఈ ఉచిత వైద్య క్యాంపులో బీపీ, షుగర్, లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్, కొలెస్ట్రాల్, ఐరన్ టెస్ట్ లాంటి ఉచితంగా టెస్టులు చేసి వాటికి అనుగుణంగా మందులు అందిస్తున్నారని, స్థానిక పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన హాస్పటల్ చైర్మన్ రాహుల్ ఆయన సతీమణి నీలిమ, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ రాజు ను అభినందిస్తూ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు సీతారామరాజు, కృష్ణరాజు , రమా, శోభ, వినయ్ ,శ్రీనివాస్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.