ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థినులు తమ సత్తా చాటారు. ఎం పి సి మొదటి సంవత్సర ఫలితాల్లో470 మార్కులకు గాను జి.అక్షర, డి. వినీష 469 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచారు. బి పి సి లో మొదటి సంవత్సరం 440 మార్కులకు గాను ఖాన్సా అలియా, ఎస్.జాగృతి, ఏ. హర్షిత 439 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందారు. మీరాబ్ ఇఫ్తెక్వార్, హజేరా కునైన్ 438 మార్కులు సాధించారు. రెండవ సంవత్సరం బై పి సి లో 1000 మార్కులకు నబేలా తహ్రీమ్, కె. హారిక 995,యస్.సారిక పాటిల్, సామా ఫిర్దోస్ – 993 మార్కులు సాధించారు. ఎం పి సి విభాగంలో1000 మార్కులకు ఎస్.శివాని, కె. త్రిపుర 994 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నిర్మల్ అగ్రగామిగా నిలిపారు .
ఈ నేపథ్యంలో విద్యార్థులను కళాశాల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి అభినందించారు.