రామగిరి, ముద్ర: బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ కొలిపాక నాగేశ్వర రావు తెలియజేశారు. వారు మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కు 5.20 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 4.10 లక్షల టన్నులు అనగా 79 శాతం ఉత్పత్తి తో పాటు 3.72 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందన్నారు. అలాగే మార్చి నెలలో నిర్దేశించిన 1.28 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.15 లక్షల టన్నులు అనగా 12 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, 0.03 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు.అందుకు కృషి చేసిన ఉద్యోగులందరికి వారు అభినందనలు తెలియజేశారు.సింగరేణి సంస్థలో కొత్తగా బదిలీవర్కర్లు గా ఉద్యోగంలో చేరుతున్న వారు సంబధిత అధికారులు, సూపర్వైజర్లు, సీనియర్ ఉద్యోగుల సలహాలు,సూచనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కోరారు.