Take a fresh look at your lifestyle.

బొగ్గు గనుల పరిరక్షణ,కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధం కండి

  • యాదగిరి సత్తయ్య బి ఎం ఎస్ అధ్యక్షులు.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ఏరియా I ఏరియా వర్క్ షాప్ లో మంగళవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వారా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, యతిపతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల పరిరక్షణ,కార్మిక హక్కుల సంరక్షణ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం అవిశ్రాంతంగా పోరాడేది బి ఎం ఎస్ మాత్రమే అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి బిఎంఎస్ పనిచేస్తుందని అన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరా నికి సంస్థ సాధించిన టర్నోవర్ వచ్చిన వాస్తవ లాభాలలో 40% వాటాను జాప్యం లేకుండా ప్రకటించి త్వరగా చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని,అలవెనుసులపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలని అన్నారు.సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ లో జరిగిన కుంభకోణాలపై న్యాయ పోరాటం చేస్తున్న బిఎంఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, దీర్ఘకాలికంగా పరిశ్రమలను పరిరక్షించుటకు బిఎంఎస్ కృషి చేస్తుందని తెలిపారు. బి ఎం ఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కర్రావుల మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కార్యదర్శి మాదాసి రవీందర్, తుమ్మ గట్టయ్య, పిట్ కార్యదర్శి, పుప్పాల నాగేంద్రప్రసాద్, దొంతుల కుమారస్వామి, నూతి శ్రీమన్నారా యణ, ఎల్లావుల కోటయ్య, సల్ల వేణు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.