Take a fresh look at your lifestyle.

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

  • పుట్టలో పాలు పోసి భక్తిని చాటుకున్న సుహాసినిలు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ఆలయాలు, పుట్టలవద్ద  బారులు తీరిన మహిళలు పాలుపొసి మొక్కులు చెల్లించి నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి-రప్ప, చెట్టు-చేమ, వాగు-వంక, నీరు-నిప్పు ఇలా అన్నింటా దైవత్వాన్ని దర్శించే దివ్య సంస్కృతి మనదని పెద్దలు చెబుతుంటారు. అందులో భాగంగానే శ్రావణ మాసం లో ఐదవ రోజు జరుపుకునే  రోజు సనాతన సాంప్రదాయం ప్రకారం పాము కూడా పరమాత్మ స్వరూపమే అని నాగుల పంచమికి విశిష్టత ఉన్నది.అందులో భాగంగానే ఉదయతపూర్వమే లేచి ఇంటిని అలంకరించి మహిళలు తలంటూ స్నానాలు ఆచరించి, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని మహిళలంతా కలిసి పుట్టల వద్దకు చేరుకొని నాగ పంచమిన మహిళలు పుట్టల్లో పాలుపొసి మా కుటుంబాలను చల్లగా చూడాలని పామును దేవతగా కొలుస్తూ వేడుకలను తెలుగురాష్ట్రల్లో ఘనంగా జరుపుకున్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాతమ్మ గుడి సమీపంలో, కాలేజీ, పోచమ్మ గుడి, గాజుల పోచమ్మ గుడి, మార్కండేయ దేవాలయం, ధరూర్ క్యాంప్ కోదండ రామాలయం ధర్మశాల ఆవరణలో, పుట్ట వద్ద మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని పుట్టలో పాలు పోసి పుట్ట వద్ద పేలాలు, బెల్లం, పుట్నాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.చిన్న పుట్ట కనిపించిన మహిళలు అక్కడికి చేరుకొని పసుపు,కుంకుమ, బుక, గులాలు చల్లి, అగర్భత్తిలు ముట్టించి పాలను పోసి ఎలాంటి సర్ప దోషం లేకుండా చల్లంగా చూడమని నాగుపాముకు పూజలు చేశారు.సుబ్రహ్మన్యేశ్వర స్వామి ఆలయంలో జోడు పాముల విగ్రహానికి, రాయికల్ మండలం కొత్తపేట నాగాలయం, బుగ్గారం మండలం గోపులాపూర్ లో,పొలాస లలితామాత ఆలయం సమీపంలో, గొల్లపల్లి, పెగడపల్లి, కొడిమ్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, మల్యాల, సారంగాపూర్, బీరుపూర్ తదితర మండలాల్లో మహిళలు నాగుల పంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.నాగులాపంచమి సందర్బంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు.భక్తులు ఆలయాల్లో గోత్రనామాధులతో అర్చన చేయించుకుని భక్తితో పూజలు చేశారు.కార్యక్రమాల్లో శ్రీ లలితామాత ఆలయ ఫౌండరి ట్రస్టి చైర్మన్ చెల్లం స్వరూప, ఉటూరి కళ్యాణి, పెద్ది అశ్విని, ఎన్నం మంజుల, రాజ్యలక్ష్మి, చెట్ల జానకి, క్యారంగుల అరుణ, జిలపెల్లి శారద, మాదేశి శిరీష, పద్మారెడ్డి,పెండెం రజిత, జ్యోతి, వెంకటవ్వ, చింత రోజా, రోహిత, మాధురి, వనిత, స్వప్న, గాండ్ల మధురిమా, మచ్చ కవిత, బోరగళ్ల లావణ్య, దాసరి స్వాతి, భాగ్య, దీప, శైలజ, జల, లతాగుప్తా, లావణ్య, నాగజ్యోతి, గోపిరాణి, సాత్విక, విజయ, అరుణారెడ్డి, సామళ్ళ కవిత, మనీషా, మాధవి, శోభా, వనజ, అర్చన, తదితరులు పాలుపొసి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.