Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆయన ఆశయాలను అడ్డుకున్నట్టే

  • విగ్రహ నిర్మాణానికి కలెక్టర్ స్పందించాలి.
  • స్పందించని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.
  • కొరటికల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలి.

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని కొరటికల్ గ్రామంలో గ్రామపంచాయతీ కూడలి వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరుషరాములు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగిందని కెవిపిఎస్ మండల బాధ్యులు చింతల నాగరాజు తెలిపారు. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడుతూ..గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణాన్ని అడ్డుకుంటే అంబేద్కర్ భావాజాలాన్ని అడ్డుకున్నట్టే అని అన్నారు.విగ్రహ నిర్మాణం పూర్తయ్య వరకు దళితులకు గ్రామంలో పోలీసులురక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు నిర్మించిన అనుమతి లేదు అనే కారణంతో దిమ్మెను తొలగించడం జరిగిందన్నారు.కాబట్టి ఇప్పుడు గ్రామపంచాయతీ అధికారులు అనుమతించాలని కోరారు. బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో అంబేద్కర్ నిర్మాణానికి వినతిపత్రం కెవిపిఎస్,గ్రామ అంబేద్కర్ దళిత సంఘాల యువత ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. లేని పక్షాన కాలినడకన పాదయాత్ర చేస్తూ విగ్రహ నిర్మాణానికి అనుమతించే వరకు ఆర్డీవో కార్యాలయాని ముట్టడిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండె మల్లేష్, గ్రామ మాజీ సర్పంచ్ నాగయ్య గౌడ్,కెవిపిఎస్ గ్రామ నాయకులు ఆర్కపల్లి ప్రకాష్, ఆనంద్, దాసు, శ్రీశైలం, అనిల్, గణేష్, సాయి తేజ, వెల్టూర్ అంబేద్కర్ యూత్ నాయకులు బాలరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.