పట్టణంలోని గోవిందాపురంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు 8వ వార్డ్ కౌన్సిలర్ కోల ఉదయభాను తెలిపారు. శనివారం హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సరైన వేదిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నల మాధ ఉత్తంకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హుజూర్నగర్ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండాలన్నారు. ముఖ్యంగా పట్టణంలోని గోవిందాపురంలో 8వ వార్డులోని ప్రధాన సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు మరియు కమిషనర్ శ్రీనివాసరావు గారిని కోరారు. ఎనిమిదో వార్డులో ప్రధానంగా గోవిందాపురం స్మశాన వాటిక బ్రిడ్జి నిర్మాణ పనులు, సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. వాటితో పాటు నిర్మాణంలో ఉన్న sc కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు సహకరించాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మాణానికి ప్రస్తుతo మంజూరైన నిధులుతో పాటు అదనంగా 20 లక్షల oరూపాయల నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలన్నారు. విద్యారంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గోవిందాపురం స్మశాన వాటిక వైకుంఠధామానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలన్నారు. వైకుంఠధామంలో చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు విడులు కేటాయించాలన్నారు. గోవిందాపురంలోని ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్లు లీకేజీ ఉన్నందున వాటిని వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గారు మరియు వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు గారు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.