Take a fresh look at your lifestyle.

* గ్రామస్తుల దాహార్తిని తీర్చే మంచినీటి బోరులను కాపాడండి! జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వెంపటి గ్రామ సర్పంచ్

 

ముద్ర, తుంగతుర్తి…
తుంగతుర్తి మండలం  వెంపటి గ్రామానికి గత కొన్ని దశాబ్దాల నుండి తాగునీటిని అందిస్తున్న మంచినీటి బోరులను రోడ్డు విస్తరణ పేరుతో తొలగించవద్దని సర్పంచ్ మరియు గ్రామ పాలకవర్గం జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తుంగతుర్తి నుండి వెంపటి, మానపురం గ్రామాల మధ్య రోడ్డు వెడల్పులో భాగంగా వెంపటి గ్రామ మంచినీటి కి ప్రధాన జీవనాధారమైన బోరులు రోడ్డు పక్కనే ఉండడంతో సదరు కాంట్రాక్టర్ వాటిని తీసివేయాలని సూచించగా వాటిని తొలగించవద్దని గ్రీవెన్స్ డే లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వెంపటి గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు తో పాటు వార్డు సభ్యులు మాట్లాడుతూ
గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న ఈ బోరులు ప్రధాన నీటి వనరుగా కొనసాగుతుందని, వీటిని తొలగిస్తే గ్రామ ప్రజలు తీవ్ర మంచినీటి ఇద్దరిని ఎదుర్కొంటామని అందువల్ల మంచినీటి బోర్లను తొలగించవద్దని తాము జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ బోరు ద్వారా వందలాది కుటుంబాలు నీటిని పొందుతున్నాయని తెలిపారు.
రోడ్డు వెడల్పు పనులు అవసరమే అయినప్పటికీ, ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను కోరారు. గ్రామ ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ బోరులను కాపాడాలని, అవసరమైతే రోడ్డు మార్గంలో స్వల్ప మార్పులు చేయాలని సూచించారు.
గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు కూడా ఈ వినతికి మద్దతు తెలుపుతూ బోరులను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.