Take a fresh look at your lifestyle.

తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్;

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు.


ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారు ఏ సమస్యతో వచ్చారో, డాక్టర్లు ఎలా వైద్యం అందిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని మంది అవుట్‌పేషెంట్లు (ఓపీ) వస్తున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు.
రోగుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, వారికి చేసిన పరీక్షలు, అందించిన చికిత్స, ఇచ్చిన మందుల వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఆసుపత్రిలోని ల్యాబ్, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్‌ను పరిశీలించారు. నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయో వివరాలు సేకరించారు.
డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
మెడికల్ స్టోర్‌లో మందులను క్రమబద్ధంగా నిల్వ చేయాలని, అవసరమైన ర్యాకులను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.