ముద్ర, మహదేవపూర్:
డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ, యువతీ యువకులకు వై ఎస్ కె ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ కోర్సులలో ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ తెలిపారు. సాఫ్ట్ స్కిల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.శిక్షణ అనంతరం జాబ్ గ్యారంటీ ఉంటుందని స్పష్టం చేశారు. కావలసిన ధృవపత్రాలు: ఆధార్, పాన్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్.టాస్క్ కార్యాలయం, మొదటి అంతస్తు, ఐటి టవర్, కరీంనగర్ నందు మొదటి బాచ్ 02-03-2026 నుండి 22-03-2026 వరకు జరుగనున్న ట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు