ముద్ర, వనపర్తి :
ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సి.వి.రామన్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ తెలిపారు. అన్ని గ్రూపుల లో విద్యార్థులు విశేష ప్రతిభను కనబరిచినట్లు వారు తెలిపారు 900 కు పైగా మార్కులు తమ కళాశాలకు చెందిన 133 మంది విద్యార్థులు సాధించారని, జిల్లాలో ఇది రికార్డు ఫలితాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజయంపై కళాశాల యజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులను సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డాక్టర్ కే వీరయ్య, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, కుమారస్వామి, ప్రిన్సిపాల్ ప్రకాష్, సీనియర్ అధ్యాపకులు వెంకటరమణ, జమీర్ ఖాన్, మల్లికార్జున్, వెంకటేశ్వర్ రెడ్డి, లింగస్వామి, శ్రీధర్, చంద్రశేఖర్, హనుమంతరావు, మనీ వర్ధన్, మహేందర్, రమేష్, శేఖర్ గౌడ్, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
