Take a fresh look at your lifestyle.

చేనేత సహకార సంఘాల సభ్యులకు మగ్గం నేసేవారికి -జియో – ట్యాగ్- కల్పించాలి, మగ్గం- నేయని- వారికి సంఘ సభ్యత్వం తొలగించాలి ….

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్క చేనేత కార్మికుడు నష్టపోకూడదని, చేనేత కార్మికునికి చేతినిండా పని కల్పించాలని ఉద్దేశంతో నిజమైన నేత కార్మికులని గుర్తించుకోవడానికి జియో ట్యాగ్ అనే నెంబర్ను కేటాయించారు. మగ్గం నేసే ప్రతి వ్యక్తి వారి మగ్గానికి జియో టాక్ నెంబరు కల్పించి ప్రభుత్వంద్వారా చేనేత కార్మికుల కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకొని వారందరికీ ఆదుకోవాలని దృష్టితో జియో ట్యాగ్ నెంబర్ ద్వారా చేనేత కార్మికులను గుర్తించడం జరుగుతుందని ప్రభుత్వం సంకల్పించింది. కానీ
చేనేత సహకార సంఘాలు :—-: చేనేత సహకార సంఘాలు లో కొన్ని సంవత్సరాల క్రితం సంఘాలలో సభ్యత్వం పొంది సంఘాలు నడుస్తుండేవి ,కానీ కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం సభ్యత్వం పొంది వారి తర్వాత వారి వంశపారంపర్యంగా సభ్యత్వం మార్పిడి చేసుకుంటూ వస్తున్న ఆనవాయితీ, అందులో ఎంతమంది మొగ్గాలు నేస్తున్నారు, ఎంతమందికి మగ్గం పని తెలుస్తుంది అనే విధానం కానీ చేనేత అధికారుల దృష్టికి లేదు , ప్రస్తుతం చేనేత కార్మికులు మగ్గం నేసే వారిని గుర్తించడానికి విధించిన జియో ట్యాగ్ విధానం సహకార సంఘాలలో జియో ట్యాగ్ నెంబర్ కల్పించి నిజమైన మగ్గం నేసే చేనేత కార్మికునికి సభ్యత్వం ఇచ్చేటట్లు కొనసాగిస్తే చాలా బాగుంటుంది .గతంలో సభ్యత్వం ఉన్నవాళ్లు వంశపారంపర్యంగా వాళ్లే మార్పిడి చేసుకుంటూ ఇంతవరకు నడుస్తుంది. ఆ విధానానికి ప్రభుత్వం ద్వారా స్వస్తి పలికిచ్చి కొత్త జియో ట్యాగ్ నెంబర్ కేటాయించి చేనేత కార్మికులుగా గుర్తించాలని .ప్రతి చేనేత కార్మికునికి చేనేత సహకార సంఘాలలో కూడా జియో ట్యాగ్ నెంబర్ కల్పించి సంఘాలలో కూడా చేనేత కార్మికులు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు పొందడానికి వీలు ఉంటుందని చాలా మంది చేనేత కార్మికులు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. నిజంగా మగ్గాలు చేసే చేనేత కార్మికులకు సహకార సంఘాల్లో సభ్యత్వం లేదని అలాంటి వారిని గుర్తించి సహకార సంఘాలలో సభ్యత్వము ఇచ్చి వారికి ఉపాధి చూపించే బాధ్యత ప్రభుత్వానిదేనిని చేనేత కార్మికులు ప్రభుత్వ దృష్టికి తెస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో చేనేత సహకార సంఘాలు….:—— జోగులాంబ గద్వాల జిల్లాలో 18 చేనేత సహకార సంఘాలు ఉండగా అందులో ఐదు చేనేత సహకార సంఘాలు 1). అల్లంపూర్,2) రాజోలి.3) ఐజ.4). ఆరగిద్ద.5). గట్టు మాత్రమే వర్కింగ్ లో ఉన్నట్టు, 13 చేనేత సంఘాలు వర్కింగ్ లో లేనట్టు సమాచారం. కానీ జిల్లాలో ఉన్న 18 చేనేత సహకార సంఘాలకు సభ్యులకు జియో ట్యాగ్ నెంబర్ కల్పించి వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే చేనేత సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, మగ్గాలు నేయని వారికి సంఘ సభ్యత్వం తొలగించి మగ్గం నేసే వారికి సంఘంలో సభ్యత్వం కల్పించాలని జిల్లాలోని చేనేత కార్మికులు ప్రభుత్వ దృష్టికి తీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.