మహదేవపూర్, ముద్ర:
భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవికి నియమితులైన మాజీ ఎంపీటీసీ, అకుతోట సుధాకర్ ను సర్పంచ్ హసీనాభాను అక్బర్ ఖాన్ వార్డు మెంబర్లు సన్మానించారు. ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు అకుతోట సుధాకర్ నమ్మకం ఉంచి నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్ను సన్మానించి అభినందించారు. వీరిలో ఉప సర్పంచ్ శ్రీజ, గడ్డం స్వామి, అస్రార్ ఖురేషి, నయూమొద్దీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, మాజీ సింగిల్ విండో చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ వామన్ రావు, అజ్మత్ లతోపాటు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇంటర్ జిల్లా టాపర్ సువైబా తస్నీమ్ కు సన్మానం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా టాపర్‌గా నిలిచిన సువైబా తస్నీమ్‌ను సర్పంచ్ హసీనా భాను, కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు.టాపర్‌గా నిలిచిన సువైబా తస్నీమ్ తన మేనకోడలు కావడం ఎంతో గర్వకారణమని సర్పంచ్ హసీనా భాను పేర్కొన్నారు. ఈ విజయం విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని ఆమె అన్నారు.
సన్మాన కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుంగల శ్రీజ సంతోష్, మాజీ దేవస్థాన చైర్మన్ వామన్ రావు, మాజీ జెడ్పీటీసీ చల్ల తిరుపతయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్కం అశోక్, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, గ్రామపంచాయతీ పాలక వర్గ సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.