ముద్ర మల్కాజిగిరి:
మహిళలను వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమనిమల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత డీసీపీ ఉషారాణి హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పాఠశాలలు, మార్కెట్లు షీ టీమ్స్ సివిల్ డ్రెస్సులో డికాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
16నుంచి ఇప్పటివరకు వరకు మొత్తం 59 మంది (49 పెద్దలు, 10 మైనర్లు) వేధింపుల కేసుల్లో పట్టుబడగా, ఎల్‌బీ నగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఏప్రిల్ 1 నుంచి 15 వరకు 72 ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో ఫోన్ కాల్స్ ద్వారా 19, సోషల్ మీడియా ద్వారా 23, ప్రత్యక్ష వేధింపులు 30 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 6 క్రిమినల్ కేసులు నమోదు చేయగా, 19 చిన్న కేసులు బుక్ చేసి, 38 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.