Take a fresh look at your lifestyle.

బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని

 

ముద్ర కాప్రా

ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. పాత హబ్సిగూడ డివిజన్‌ ఆధ్వర్యంలో ఇందిరా ఎంపిరియల్ లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ మెంబర్‌షిప్ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక నాయకులు, మాజీ డివిజన్ అధ్యక్షులు, యువ నాయకులు, మహిళా నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.