ముద్ర, యాదగిరిగుట్ట :
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత లక్ష్యమని ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు అన్నారు.
యాదగిరిగుట్ట టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, యాదగిరిగుట్ట దేవస్థాన భద్రతా విభాగానికి చెందిన ఎస్పీఎఫ్ సిబ్బందికి బుధవారం కొండపైన సీపీఆర్ ఫైర్ ఫైటింగ్ అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించే విధానం, సీపీఆర్ పద్ధతులు మరియు ప్రాథమిక చికిత్స పై సిబ్బందికి నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిఇఓ నవీన్ ఎస్సై రవికుమార్ సిబ్బంది నందు నాయక్ మురళి కురుమూర్తి పాండు శ్రీకాంత్ రెడ్డి సిద్ధులు మహేష్ అనిల్ లక్ష్మణ్ దేవస్థానం సిబ్బంది సుధాకర్ బాలరాజు హోంగార్డ్స్ విజయ్ మమత వైద్య బృందం అగ్నిమాపక శాఖ పాల్గొన్నారు.