Take a fresh look at your lifestyle.

కొండపైన ఒక వర్గం చేతిలో ఉన్న వ్యాపార సముదాయాలకు టెండర్లు పిలవాలి… బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో దేవస్థాన ఈఓకి వినతిపత్రం

ముద్ర, యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట కొండపైన 30, 40 ఏండ్ల నుండి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని బిజెపి యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేవస్థానం కార్యనిర్వాహణాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శికాదూరి అచ్చయ్య మాట్లాడుతూ కొండపైన 30, 40 ఏండ్ల నుండి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయని వీటిని టెండర్ వేయకుండా రాజకీయ బలంతో డబ్బు బలంతో అడ్డుకుని అతి తక్కువ కిరాయితో వర్తక సంఘం పేరుతో షాపులు నడుపుతున్నారని అన్నారు. కొండపైకి వచ్చే భక్తులను దోపిడీ చేసే విధంగా వివిధ వ్యవహారం ఉందని కొండపైన దేవస్థానం ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంది కానీ వర్తక సంఘానికి లేదని తాతలు తండ్రులు కొడుకులు అన్నట్టు నేటి సంఘం వారు షాపు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంకు మద్దతుగా ఉండి వాటికి లంచాలు ఎర గా వేస్తూ వీటిని రెన్యువల్ చేసుకుంటూ వస్తు కొబ్బరి కాయ 100, వాటర్ బాటిల్ 40కి అమ్ముతూ భక్తులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణం, మండలంలో కొన్ని వందల మంది నిరుద్యోగ యువకులు 10వేల జీతానికి పట్టణాలకు పోయి పని చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది వీళ్లు మాత్రం సబ్ లీజ్ ల పేరుతో నెలకు 50000 తీసుకొని వీళ్ళు పబ్బం గడుపుతున్నారని ఈ వర్తక సంఘంలో నిజమైన పేదలు ఎవరన్నా ఉంటే వారికి మినహాయింపు ఇస్తాం కానీ తక్షణ సంఘాన్ని రద్దుచేసి వేలం నిర్వహించడం ద్వారా దేవస్థానానికి కొన్ని కోట్లలో ఆదాయం వస్తుందన్నారు. వర్తక సంఘం రద్దు చేయని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, పట్టణ మండలం మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ కార్యదర్శిలు దొమ్మాట ప్రభాకర్, ఆవుల సత్యం, ఆలేటి కర్ణ, సురేష్, సీనియర్ నాయకులు లింకలపల్లి శ్రీనివాస్, మిర్యాల కృష్ణ ,బోడ బుచ్చిబాబు, బండ కింది సాయి , సుధగని ప్రశాంత్, విజయ్, శ్రీనాథ్ , శ్యామ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.