- పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం.
- సంపద సృష్టిస్తాం పేదలకు పంచుతాం.
- తెలంగాణ దేశానికే రోల్ మోడల్.
ముద్ర విలేకరి, అచ్చంపేట: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలో బల్మూరు మండలం గట్టు తుమ్మెన్ గ్రామంలో వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలను ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ,రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, లతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన కార్యక్రమంలో ప్రారంభోత్సవం చేశారు.

ఈ వేసవిలో రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసాం.ఈ సందర్బంగా మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ విద్యుత్ ఉప కేంద్రాలకు కోట్లు 43,అంచనా వ్యయంతో 5 విద్యుత్ ఉప కేంద్రలు నిర్మించారు. ఈ సబ్ స్టేషన్ ల ద్వారా అచ్చంపేట నియోజకవర్గం పదరా, బల్మూరు, లింగాల, వంగూరు, ఉప్పునుంతల మండలాల్లోని ఆయా గ్రామాల పరిధిలోని గృహ, వ్యవసాయ భూములకు కరెంట్ కష్టాలు తీరును న్నాయని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు.ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ కరెంట్ ఉత్పత్తిపై, ప్రత్యేక దృష్టిసారించినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో అంచనాలకు మించి 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసాం. రీజనల్ రింగ్ రోడ్డు, మూసి పునర్ జీవనం, ప్రతి జిల్లాలో ఉత్పత్తి రంగాన్ని పెంచాలన్న ప్రణాళికలతో కరెంటు డిమాండ్ రాబోయే రోజుల్లో ఇంకా పెరగనుంది.మరో 50 సంవత్సరాలకు కరెంటు డిమాండ్ ప్రణాళికలను తయారు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 2029 – 30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా దేశంలో ఒక మోడల్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నడూ లేని విధంగా ఇల్లు లేని పేద ప్రజల ఇంటి కలను సాకారం చేయాలని ఉద్దేశంతోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. గిరిజన బిడ్డలకు 12,600 కోట్లతో పథకాన్ని ప్రారంభించడం ఓ గొప్ప సాహసంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అభివర్ణించారు.గిరిజనులు తలెత్తుకొని బతికేలా ఈ పథకం చేయూతని ఇస్తుంది అన్నారు.ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాడో వంటి పంటలను గిరిజనులకు అందుబాటులోకి తీసుకు వచ్చాము, ఈ పంట రెండు సంవత్సరాల్లో ఫలితాలు ఇస్తుంది ఆలోపు గిరిజనులకు ఆదాయం వచ్చేలా అంతర పంటలు సాగుకు ఉచితంగా ఉద్యాన శాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేస్తాం అని డిప్యూటీ సీఎం తెలిపారు. మేం తెచ్చి ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్ గా మిగులుతుంది.కులగనను విజయవంతంగా ఎలా పూర్తి చేశారు అని దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణను అడుగుతున్నాయి.గత పాలకులు 10 సంవత్సరాలు పాలించిన ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు పెడితే మేము రాగానే అందులో ఎనిమిది వేల కోట్ల ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేశాం.ఇంకా కొన్ని మిగిలిపోతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి దశలవారీగా పూర్తి చేస్తామని ఉద్యోగులను ఒప్పించాం అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల ను సాకారం చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లు గృహ జ్యోతి పథకంతో రాష్ట్రంలో 90 శాతం మంది కరెంటు బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా పోయింది, ఈ వేసవిలో రికార్డు స్థాయిలో అంచనాలకు మించి 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసాం.రీజనల్ రింగ్ రోడ్డు, మూసి పునర్ జీవనం, ప్రతి జిల్లాలో ఉత్పత్తి రంగాన్ని పెంచాలన్న ప్రణాళికలతో కరెంటు డిమాండ్ రాబోయే రోజుల్లో ఇంకా పెరగనుంది. మరో 50 సంవత్సరాలకు కరెంటు డిమాండ్ ప్రణాళికలను తయారు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 2029 – 30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం. మరో రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను ప్రజా ప్రభుత్వం చేస్తుంది, ఎంతటి ఆర్థిక భారం అయినా సరే రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం.గత పాలకులు నాలుగు ఇల్లు కూడా నిర్మించలేదు అని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపినారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తు తరాలకు మిగులు విద్యుత్తు అందిస్తాం, ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మే స్థాయికి ఎదుగుతాం అని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.

రీజనల్ రింగ్ రోడ్డు, మూసి పునర్ జీవనం, ప్రతి జిల్లాలో ఉత్పత్తి రంగాన్ని పెంచాలన్న ప్రణాళికలతో కరెంటు డిమాండ్ రాబోయే రోజుల్లో ఇంకా పెరగనుంది. మరో 50 సంవత్సరాలకు కరెంటు డిమాండ్ ప్రణాళికలను తయారు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని వివరించారు. 2029 – 30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తాం అన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల ఖర్చు భారం తగ్గించేందుకు రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపు సీట్లకు 24 గంటల ఉచిత కరెంటు అందజేస్తున్నాం, రైతుల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు 12,500 కోట్లు చెల్లిస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ ప్రాజెక్టు జీవో ఇచ్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. మూడు నెలలు ఆరు నెలలు రెండు సంవత్సరాల్లో పూర్తిచేసే ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్టు అచ్చంపేట నియోజకవర్గం లో 45వేల పంపుసెట్ల కు సోలార్ పవర్ ఏర్పాటు చేయడంపై విద్యుత్ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా క్షణం కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, అకుంఠిత దీక్షతో ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల సంక్షేమం కోసం, వారి ఆర్థిక వనరులను మెరుగుపరిచేందుకు అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ఉచిత సోలార్ విద్యుత్ అందించి, ఆర్థికంగా ప్రయోజనం కల్పించేందుకు అత్యధిక నిధులు కేటాయిస్తుందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే, ప్రజా సంక్షేమాన్ని ఆపకుండా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా పనిచేస్తుందని తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి మల్లు రవి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్రానికి రెండు కళ్ళల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అన్నారు.ఇది పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండి.ఇందిరా జలవికాసం ఆరంభం మాత్రమే కాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాం అని తెలిపారు. సంపద సృష్టిస్తాం ప్రతిపక్ష పేదల కోసం ఖర్చు చేస్తాం అన్నారు, ఈ ఆలోచనలో భాగంగానే ఇప్పటివరకు అనేక సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. పేద ప్రజల ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తూనే పేద ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అందుకు పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి జూపల్లి కృష్ణారావు సారధ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పనులన్నీటికి పెద్ద పూజారిగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి వివరించారు.ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుందని ఆయన తెలిపారు.
ఈ సందర్బంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయం లేకుండా వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహకారంతో 43 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభం శంకుస్థాపన పనులు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.నల్లమల్ల గిరిజన ప్రజల సంక్షేమం కోసం ఇటీవలే ఇందిరా సౌర గిరి వికాసం పథకాన్ని తీసుకురావడం ద్వారా అచ్చంపేట ప్రజల చిరకాల స్వప్నం సాకారం అయిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.నియోజకవర్గానికి అదనంగా మరో 300 ట్రాన్స్ఫార్మర్లు కావాలని, అచ్చంపేట నియోజకవర్గానికి మరో 1000 ఇందిరమ్మ ఇండ్లను అందించాలని ఉప ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే విన్నవించుకున్నారు.అచ్చంపేట నియోజకవర్గానికి ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో నూతన సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు అందజేయడం ఇదే తొలిసారి జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్, గ్రంథాలయ చైర్మన్ రవీందర్, చైర్మన్, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

