Take a fresh look at your lifestyle.

ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు.. బ్రహ్మకు ప్రతిరూపమే కుమ్మరులు : మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు శుక్రవారం పట్టణంలోని కుమ్మరి వాడ కుండల బజార్ లో పట్టణ కుమ్మరి సంఘం అధ్యక్షులు చిన్నగారి బాలరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పాల్గొని ముళ్ళమాంబ విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడారు. రామాయణాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా రచించింది కబయిత్రి మొల్లమాంబ అని అన్నారు. కుమ్మరులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందితేనే బలోపేతం అవుతారని అన్నారు. బ్రహ్మకు ప్రతిరూపమే కుమ్మరులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ లు బండారు స్వర్ణలత, పచ్చాల జగన్మోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడూరి నరసింహ, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి గోపాల్, బిజెపి నాయకులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు కుమ్మరి సంఘం నాయకుడు పాల్గొన్నారు. అనంతరం అధ్యక్షులు చినగారి బాలరాజ్, కార్యదర్శి తాడూరి మహేష్, కోశాధికారి తాడూరు శ్రవణ్ లు అన్న ప్రసాద వితరణ గావించారు.

Leave A Reply

Your email address will not be published.