- విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి కొనసాగుతున్న వాహనాల రద్దీ.
- యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.
- వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు.
- పంతంగి టోల్ ప్లాజా లో మొత్తం 16 టోల్ బూతులు ఉండగా, వాహనాల రద్దీ దృశ్య 12 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచారు.
- మామూలు రోజులలో 35,000 నుండి 45000 వాహనాలు వెళ్తాయని సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే యాభై ఐదు వేల వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్లు టోల్ అధికారులు తెలిపారు.
- వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుండి వెళ్తుంది,నిమిషానికి 300 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు టోల్ సిబ్బంది తెలిపారు.
- హైవే పై ప్రతి 30 కిలోమీటర్ల కు ఒక క్రేన్, అంబులెన్స్,టోయింగ్ వెహికిల్ అందుబాటులో ఉంచినట్లు (NHAI )నేషనల్ హై వే అథారిటీ అధికారులు తెలిపారు.
- పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్
- ఔటర్ పై బారులు తీరిన వందల వాహనాలు.
- టోలు ఫీజలు వసూలు చేస్తుండడంతో భారీగా నిలిచిన వాహనాలు.
- తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వాహనదారులు.
Next Post