Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభం చేయాలి.. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

 

 

ముద్ర, తుంగతుర్తి…
తుంగతుర్తి మండలంలో ఇటీవల ప్రారంభం చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని ఇంకా ప్రారంభం కాని కేంద్రాలు తక్షణమే ప్రారంభం చేయాలని అధికారులను కోరారు. రానున్న రోజుల్లో అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా ఉన్నది కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా వెంటనే మిల్లులు కేటాయించి గోనె బస్తాలు పంపి త్వరగా లారీలు మిల్లుల వద్ద దిగుమతి అయ్యేవిధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు .తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే రవాణ అయ్యే విధంగా లారీలను పంపాలని అన్నారు. మిల్లుల వద్ద ఎలాంటి తరుగు కోతలు లేకుండా దిగుమతి చేసుకొని మూడురోజుల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు మంచినీటి సౌకర్యం టెంట్ సౌకర్యం కల్పించే విధంగా నిర్వాకులకు ఆదేశాలివ్వాలని అన్నారు. రైతు కొనుగోలు కేంద్రాల్లో కానీ
మిల్లుల వద్ద కానీ రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వ అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు, గోపగాని రమేష్, గోపగాని వెంకన్న, భాస్కర్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.