బోథ్, ముద్ర:
అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతోనే రైతులు నష్టపోతున్నారని అన్నారు. అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వీరి వెంట బోథ్ మండల మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.