Take a fresh look at your lifestyle.

​ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

ముద్ర కూకట్‌పల్లి :
వివేకానంద నగర్, అల్లాపూర్ గాయత్రీ నగర్ డివిజన్లలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ నాగదేవత సహిత పోచమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ అన్నారు. ​ఆలయ కమిటీ చైర్మన్ పులిగోల్ల శ్రీనివాస్ యాదవ్, ప్రెసిడెంట్ కాయితి యాదవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కల్వల ఏడుకొండలు మరియు జనసేన నాయకుడు పవన్ నాయుడు ఆహ్వానం మేరకు ప్రేమ కుమార్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, ప్రాంగణంలోని ఫ్లోరింగ్ కోసం అవసరమైన గ్రానైట్‌ను అందజేస్తానని హామీ ఇచ్చారు.
​అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజల విశ్వాసమే నా బలం, దేవాలయాల అభివృద్ధి నా బాధ్యత” అని స్పష్టం చేశారు. భక్తులందరి సహకారంతో ఈ పవిత్ర కార్యక్రామాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆత్మూరి మోహన్, పాదం సూర్య, జయమ్మ శ్రీను, గణేశుల నాగేశ్వరరావు, జెల్లా రవి, సూర్యనారాయణ, లలిత మాత గ్రూప్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.