Take a fresh look at your lifestyle.

భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

  • ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
  • యశ్వంతరావుపేట భూభారతి సదస్సుకు కలెక్టర్ తో కలిసి విప్ హాజరు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మండల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పైలెట్ మండలంలో సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ భూ భారతి చట్టంపై రైతులు అవగాహన కల్పించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పెండింగ్లో ఉన్న భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన అర్జీలను కాకుండా రేపు కూడా అధికారులకు అందించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ సదస్సులో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసిల్దార్ మాజీద్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సుభాష్, నాయకులు బాధినేని రాజేందర్, సత్యనారాయణ రావు, నర్సాగౌడ్, శంకర్, మద్దేల నారాయణ, గడ్డం నారాయణ, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.