Take a fresh look at your lifestyle.

సమ్మర్‌ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోండి: డిఇఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్యంశ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్‌ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు.కల్వకుర్తి పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి బాలికల రెసిడెన్షియల్ సమ్మర్‌ క్యాంప్‌ను జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించి మాట్లాడారు.క్యాంప్‌లో స్పోకెన్‌ ఇంగ్లీష్‌, స్పీడ్‌ మ్యాథ్స్, డ్యాన్స్‌, మ్యూజిక్‌, యోగ, మెడిటేషన్‌, కంప్యూటర్‌, కోడింగ్‌, పెయింటింగ్స్‌ మొదలైన అంశాలు ఈ సమ్మర్‌ క్యాంప్‌లో శిక్షణ ఇవ్వన్నాడు తెలిపారు.ప్రతి విద్యార్థి శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.ఇక్కడ నేర్చుకున్న అంశాలు జీవితంలో ఎదగడానికి ఉపకరిస్తాయన్నారు. 15 రోజులపాటు జరిగే శిక్షణను సక్రమంగా నడిపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిసిడిఓ శోభారాణి, కల్వకుర్తి యంఈఓ శంకర్ నాయక్, కల్వకుర్తి కేజిబివీ ప్రత్యేక అధికారి రమాదేవి, జిల్లాలోని వివిధ కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్లు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.