ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కే.జనార్దన్ రెడ్డి 57 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 88 ఓట్లు ఉండగా 85 ఓట్లు పోలయ్యాయి. జనార్దన్ రెడ్డికి 71, ప్రత్యర్థి రాములుకు 14 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా శ్రీపతిరావు 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీపతిరావుకు 49, వినోద్ కుమార్ కు 35, నోటా 1 వచ్చాయి. ఉపాధ్యక్షులుగా శోభన్ గౌడ్ 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శోభన్ గౌడ్ కు 45, పాండుకు 40 ఓట్లు వచ్చాయి. కార్యవర్గ సభ్యులుగా కె ఎల్ ఎన్ దత్తు (75), ప్రశాంత్ (64), అసిఫ్ హుస్సేన్ (63) గెలుపొందారు. ఏకగ్రీవంగా సంయుక్త కార్యదర్శిగా వేణు గోపాల్ చారి, గ్రంథాలయ కార్యదర్శిగా డి. రమేష్, కోశాధికారిగా నర్సింలు, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా రవి గౌడ్, మహిళా కార్యవర్గ సభ్యులుగా మమత, మంజుల ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శిరిగి ప్రభాకర్ ప్రకటించారు. గెలుపొందిన వారికీ తోటి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
