Take a fresh look at your lifestyle.

ఏసీబీ వలలో మామడ ఎస్ఐ

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ ఎస్సై గా పని చేస్తున్న తీగల అశోక్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భూ తగాదా విషయంలో బాధితునిపై చీటింగ్ కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎస్సై అశోక్ రూ. 20 వేలు డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని అందజేస్తున్న క్రమంలో ముందస్తు సమాచారం ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కరీం నగర్ కోర్టు లో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ మధు స్పష్టం చేశారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను వాట్సాప్ నెంబర్ 9440446106 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.