Take a fresh look at your lifestyle.

కొండపైన ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

 

ముద్ర, యాదగిరిగుట్ట :

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని కొండపైన పుష్కరిణి వద్దగల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు సురేంద్ర చార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు, పురోహితులు ఘనంగా నిర్వహించారు.అభిషేకం ప్రత్యేక అలంకారం హనుమాన్ చాలీసా పారాయణం సుందరకాండ పారాయణం వేద పఠనం లక్ష తమలపాకు అర్చన మహామంగళహారతి చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేయడం జరిగినది.ఈ వేడుకలో ఆలయ ఈవో భవాని శంకర్ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు ఆదిత్యాచార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.