ముద్ర. పరకాల.
ఇంతకుముందు గెలిచిన వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి లేదని ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 9 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాసని దయాకర్ వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తన మద్దతు దారులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. రెండు మూడు పర్యాయాలు ఈ వాటి నుంచి గెలిచిన అభ్యర్థులు ఇప్పటివరకు ప్రజల సమస్యలను అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. దామెర చెరువు మత్తడి వలన శ్రీనివాస కాలనీ ముంపుకు గురవేదని దాన్ని పట్టించుకోని పరిష్కారం చేసిన స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి రుణపడి ఉంటామని దయాకర్ అన్నారు అదేవిధంగా శ్రీనివాస కాలనీ 9వ వార్డుతోపాటు పరకాల పట్టణంలోని ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిరక్షించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని ఆయన అన్నారు. 9వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మంచినీటి సమస్య అంతర్గత రోడ్ల నిర్మాణం పారిశుధ్యం మురుగు కాలువల నిర్మాణం చేపట్టే విధంగా తాను ప్రయత్నం చేస్తానని వార్డు ప్రజలకు ఆయన హామీ ఇస్తూ కోట్లు అడుగుతున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దారుణ వేణుగోపాల్ తో పాటు మహిళలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.