Take a fresh look at your lifestyle.

డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డ్రగ్స్ అమ్ముతున్నారని తెలియగా ఎస్సై లక్ష్మీనరసయ్య సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుచుండగా వారిని ఆపి ప్రశ్నించిగా వారి పేర్లు జిల్లా వెస్ట్ బెంగాల్ కు చెందిన హబీబుర్రహ్మాన్ (48) మాల్దా , ఎస్.కె. ఖాదిర్ (30) తెలిపారని చెప్పారు. వారి వద్ద 50 గ్రాములు బ్రౌన్ షుగర్ ను సీజ్ చేయడం జరిగిందని దీని విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని చెప్పారు. దీనిని వీరు పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ బార్డర్ వద్ద గల మాల్దా జిల్లా నుంచి తీసుకువచ్చి ఇక్కడ అధిక లాభాలకు అమ్ముతున్నారని తెలుస్తుందన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.