ముద్ర : కాప్రా
విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కోరారు. అకాడమీ హైట్స్ నాచారంలో జరిగిన స్కూల్ స్పోర్ట్స్ మీట్ ను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి స్పోర్ట్స్ మీట్ లు మరెన్నో నిర్వహించాలని ఆయన సూచించారు.
క్రీడల్లో రాణించి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శివ కుమార్, బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ శ్రీనివాస్ బంటి తదితరులు పాల్గొన్నారు.