Take a fresh look at your lifestyle.

ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్

 

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):

జనాభా లెక్కలు 2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశ చేపట్టవలసిన ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికార యంత్రాంగానికి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ సూచించారు.


ఆదివారం జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరంలో చార్జ్ అధికారులు (తహసీల్దార్ & మున్సిపల్ కమినర్లు), అదనపు చార్జి అధికారులకు(ఎంపిడీవోలు, మేనేజర్లు)లకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జన గణన, ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026 సంవత్సరంలో మొదటి విడతలో ఇండ్ల గణన కార్యక్రమాన్ని పూర్తి డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదుచేసి ఇండ్ల జాబితా రూపొందిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గణన ప్రక్రియ ను నిర్వహిస్తారని, తమ యొక్క మండల పరిధికి చార్జ్ అధికారులుగా తహసిల్దార్లు, అదనపు చార్జ్ అధికారులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వ్యవహరిస్తారని అదేవిధంగా తమ యొక్క మున్సిపల్ పరిధికి చార్గ్ అధికారులుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ మరియు అదనపు ఛార్జ్ అధికారులుగా మేనేజర్లు వ్యవహరిస్తారని తెలిపారు సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, మాస్టర్ ట్రైనర్లు వివరించే ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యచరణ ప్రకారం జాబితా రూపొందించాలని తెలిపారు.
15, 16, 17 రోజులలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశాన్ని నేర్చుకుంటూ ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సిపిఓ సౌమ్య, జెడ్పి సీఈవో కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, ఆర్డీవోలు తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.