ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కర్ణాటకలోని కర్ణాటక విశ్వవిద్యాలయం, ధార్వాడ్ లో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాలకు చెందిన గీత బిఏ ద్వితీయ ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపినారు.

యువతలో జాతీయ సమైక్యతను, భిన్నత్వంలో ఏకత్వ భావనను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలలో జాతీయ సమైక్యత శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపినారు.

తెలంగాణ రాష్ట్రము నుండి కర్ణాటక రాష్ట్రంలో నీ ధార్వాడ్ విశ్వవిద్యాలయంలో ఈనెల 11 నుండి 17వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ సమైక్యతా శిబిరానికి తమ కళాశాల విద్యార్థిని గీత బిఏ ద్వితీయ ఎంపికై ఆ శిబిరంలో పాల్గొంటున్నారని, తెలంగాణ నుండి బయలుదేరిన పదిమంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల బృందంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, అందులో తమ కళాశాలకు చెందిన గీత బిఏ ద్వితీయ ఉండడం కళాశాలకు గర్వకారణమని తెలిపినారు. ఈ జాతీయ సమైక్యతంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తూ తెలంగాణకు మంచి గుర్తింపును తెస్తున్నారని, అదేవిధంగా వివిధ రాష్ట్రాలు ప్రదర్శించే సంస్కృతి సాంప్రదాయాలు,భాష,ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారని,దీనివల్ల యువతలో సమైక్యత భావము పెంపొంది తామంతా భారతీయులమేనని, సమైక్యంగా జీవించాలని, అదే విధంగా భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమని,తమ కళాశాల విద్యార్థిని ఎంపిక చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ చైర్మన్ మరియు వైస్ ఛైర్మన్ కుమార్ గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సిహెచ్ వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు,అధ్యాపక బృందము తదితరులు పాల్గొన్నారు.