ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మహిళల స్వేచ్ఛా ప్రయాణం – తెలంగాణకు గర్వమని జిల్లా అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్ రావు అన్నారు. మహాలక్ష్మి పథకం- మహిళలకు ఉచిత ఆర్ టిసీ బస్ ప్రయాణం విజయోత్సవాలు పురస్కరించుకొని మహిళలు ఆదా చేసిన ప్రయాణ ఖర్చు రూ.10,012 కోట్లు దాటిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టాండ్ వద్ద మంగళవారం విజయోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణంలాగే ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉచిత సేవలను ఉపయోగించుకోవాలని మహిళలను ఉద్ద్దేశించి కోరారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్.డి.ఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, జిల్లా గ్రందాలయ చైర్మెన్ మహ్మద్ అవైస్ చిస్తీ, వైస్ చైర్మెన్ పొతం శెట్టి మంజుల వెంకటేష్, ఇంచార్జీ మున్సిపల్ కమీషనర్ కొండల్ రావు , యాదగిరిగుట్ట డిపో డి ఎం సి.ఎచ్ మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ లు, అధిక సంఖ్య లో మహిళలు పాల్గొన్నారు.