- హాస్పిటల్లో ఉపాధి కూలీలను పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు.
మంథని, ముద్ర : మంథని మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పనులు చేసే క్రమంలో మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి.ఈ దాడిలో 11 మంది కూలీలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తేనెటీగల దాడికి గురైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శేషయ్య సూరి, ఎపిఓ సదానందం,టెక్నికల్ అసిస్టెంట్ సారమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, ప్రజాసంఘాల నాయకులు బూడిద గణేష్,ఆర్ల సందీప్,గొర్రెంకల సురేష్,మంథని లింగయ్య, బావు రవి తదితరులు పాల్గొన్నారు.