రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఠాగూర్ స్టేడియం సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించారు. యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్, ఉపాధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శి కరుణాకర్, మెప్మా టిఎంసి శ్రీధర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.