Take a fresh look at your lifestyle.

బహిరంగ సభను జయప్రదం చేయండి

ముద్ర ప్రతినిధి, హనుమకొండ: నేడు హైదరాబాద్ ఎల్.బి స్టేడియం లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి పిలుపునిచ్చారు.గురువారం వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నేడు జరిగే బహిరంగ సభలో యూత్ కాంగ్రెస్ బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకుల తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, వినోద్ నాయక్, బానోత్ వెంకన్న నాయక్, శేఖర్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.