Take a fresh look at your lifestyle.

ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యం

  • ఎన్నికల హామీలో లేకున్న సన్న బియ్యం పంపిణీ.
  • అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు.
  • గత ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు.
  • రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.

ముద్ర,పానుగల్: ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శుక్రవారం పానుగల్ మండల పరిధిలోని రేమద్దుల, కిష్టాపూర్ తండా,గోపులాపూర్,అన్నారం గ్రామాలలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఒకప్పుడు రేషన్ షాపు ద్వారా పేదలకు ఉచితంగా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే వాటిని తక్కువ ధరకు అమ్ముకునే వారని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల పై ఉచితంగా నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేసే అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వకున్నప్పటికీని పేద ప్రజల సంక్షేమ కోసం నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రజా పాలన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.గత ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులో ఉన్నపటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని అన్నారు.అనంతరం పానుగల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్,ఆర్డీఓ సుబ్రమణ్యం,జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథం,DRDO ఉమా దేవి,ఇరిగేషన్ శాఖ EE మధుసూదన్ రావు,DE వెంకట రమణ దేవి,తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి,ఎంపీడీవో గోవింద రావు,మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు,మాజీ జెడ్పిటిసి రవికుమార్,సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి,పుల్లారావు, బ్రహ్మం,గోపాల్ రావు,RI లు మహేష్,తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.