ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్), జగిత్యాల లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారినుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. కె. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఖాళీల వివరాలను ఆయన తెలిపారు.ఇంగ్లిష్ –1, కామర్స్–2, కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ -1, పొలిటికల్ సైన్స్-01, జువాలజీ-01,బోటనీ -01, కెమిస్ట్రీ – 1, మ్యాథ్స్ -1 చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు. కమీషనర్ ప్రొసీడింగ్స్ ఆదేశాలకు లోబడి, పోస్టు గ్రాడ్యూయేషన్లో 55 శాతం మార్కులుండి, నెట్, సెట్, పీహెచ్ డి ,టీచింగ్ లో అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జులై 24 సాయంత్రం 4.00 గంటల లోపు తమ బయోడేటాతో పాటు దరఖాస్తులను కళాశాల ఆఫీస్ లో సమర్పించాలని సూచించారు.ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను జూలై 26 శనివారం ఉదయం 10 గంటలకు, ప్రిన్సిపాల్ ఛాంబర్ లో నిర్వహించబడునని అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.