Take a fresh look at your lifestyle.

సన్నబియ్యం పంపిణీలో రాజీపడొద్దు

  • సన్నబియ్యం పథకం దేశంలో చారిత్రాత్మకం.
  • హైదరాబాద్ జిల్లాలో రెండ్రొజుల్లోనే 30 శాతం పంపిణీ.
  • కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో సర్వే. 
  • అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు.
  • గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలి.
  • క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి.
  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
  • సన్న బియ్యం పంపిణీ పై జిల్లా కలెక్టర్లతో మంత్రి సమీక్ష.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కార్​ అమలు చేసిన సన్న బియ్యం పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.శనివారం హైదరాబాద్​ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం, అమలు తీరు తెన్నులపై పౌర సరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సన్న బియ్యం పంపిణీలో ఎక్కడ కూడా రాజీపడొద్దు అని అధికారులకు సూచించారు.సన్నబియ్యం పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున సన్న బియ్యం కార్యక్రమం అందించలేకపోయామని సందర్భంగా గుర్తు చేశారు.పౌరసరఫరాల శాఖాధికారులందరూ పథకం అమలుపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.ముఖ్యంగా హైదరాబాద్​ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా సాఫీగా సాగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కొరత  ఉన్న నేపథ్యంలో అవసరమైన పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్​ జిల్లాలో మొత్తం 653 రేషన్ షాపులు ఉన్నాయన్నారు.తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.జిల్లాలోని 14,500 మెట్రిక్ టన్నులకు పైగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఇప్పటివరకు జిల్లాలో 2రోజుల్లోనే 30శాతానికి పైగా సన్నబియాన్ని పంపిణీ చేశామన్నారు.హైదరాబాద్ జిల్లాలో సరిపడా ప్రభుత్వ గోదాములను  లేకపోవడంతో ప్రభుత్వ స్థలాల్లో గోదాములు ఏర్పాటుకై ప్రతిపాదనలు అందించాలని సివిల్ సప్లై అధికారులను మంత్రి ఆదేశించారు.హైదరాబాద్ లో రెండు రోజుల నుండి రేషన్ షాప్ ల నుండి లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకు వెళ్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందనీ వాటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో జీహెచ్​ఎంసీ నుండి సిబ్బంది సహకారం పౌర సరఫరాల శాఖకు అందిస్తామన్నారు.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహాన్ మాట్లాడుతూ సన్న బియ్యం పథకం పేదలకు వరమని చెప్పారు.దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషమన్నారు.అన్ని రేషన్ షాపులలో సన్న బియ్యం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సివిల్ సప్లై అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో 653 రేషన్ షాపుల్లో 6.39లక్షల మంది రేషన్ కార్డు దారులున్నారన్నారు.ఇప్పటివరకు 30 శాతానికిపైగా సన్న బియ్యం పంపిణీ చేపట్టడం జరిగిందని అన్నారు. ఉన్నటువంటి గోదాములతో పాటు మరికొన్ని గోదాములు అవసరం ఉందన్నారు.అందుకు ప్రభుత్వ భూముల్లో గోదాములు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.అన్ని రేషన్ షాప్ లలో అధికారులు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ముకుంద రెడ్డి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకాంత్, జిల్లా సివిల్ సప్లై అధికారి రమేష్, ఆర్డీవోలు  రామకృష్ణ, సాయిరాం,  డిటి లు,  ఏఎస్ఓ లు,ఇన్స్పెక్టర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.