- జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్.
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: పోలీసులు తమ విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. గురువారం కల్వకుర్తి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల్లో ఉండే సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేషన్కు వస్తున్న ఫిర్యాదులు వాటి పరిష్కారాలు కేసుల నమోదు తదితరు అంశాలపై రికార్డులను పరిశీలించారు. పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ఆరా తీశారు. దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ పెంచాలని చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని సూచించారు. పట్టణ శివారు కాలనీలో గస్తీ పెంచాలని అన్నారు. అనంతరం డిఎస్పి వెంకటరెడ్డి, సీఐ నాగార్జున తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.