ముద్ర, నారాయణపేట:
జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలుర వసతి గృహంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు నరేష్, సాయికుమార్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ గురుకుల బాలుర హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల పై సిరాజ్ దిన్ అనే టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ విద్యార్థులు రాత్రి నిద్రించిన సందర్భంలో బట్టలు విప్పడం…తొడలు గిల్లడం లాంటి వికృత చేష్టలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. విషయం తెలుసుకునేందుకు మైనార్టీ హాస్టల్ కు వెళ్ళిన విద్యార్థి సంఘం నాయకులకు కూడా హాస్టల్ ప్రిన్సిపల్ పొంతనలేని సమాధానం చెప్పారని… హాస్టల్ ప్రిన్సిపాల్ ఖాజమైనుద్దీన్ పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై టీచర్ తీరును దృష్టికి తీసుకు వస్తే కూడా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసంమన్నారు.