ముద్ర ప్రతినిధి,నిర్మల్:
నిర్మల్ జిల్లా స్త్రీ నిధి రుణాల మంజూరు, రికవరీల్లో 2024-25 సంవత్సరానికి గాను రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేశారు. 2024-25 సంవత్సరానికి రూ. 10,649 కోట్ల రుణాలు లక్ష్యం కాగా లక్ష్యాన్ని మించి రూ 11,536 కోట్ల రుణాలు అందజేశారు. అలాగే రికవరీల లక్ష్యంలో రూ.108.33 కోట్లు వసూలు చేసి 88 శాతం మేర రికవరీ చేశారు. అలాగే ఉత్తమ మండలంగా లోకేశ్వరం నిలిచింది. ఉత్తమ ఉద్యోగులుగా లోకేశ్వరం సహాయ మేనేజర్ కల్పన, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణమ్మ, ఏపీడి చరణ్ దాస్ ఉన్నారు.