Take a fresh look at your lifestyle.

జనవరి లోనే సమ్మర్ డిమాండ్ … గత నెలలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్

  • రాష్ట్రంలో 15205 కు చేరిన పీక్ డిమాండ్
  •  జనవరి 31 న పీక్ డిమాండ్ 15205 మెగావాట్లు     
  • గతంలో మార్చి నెలలో రికార్డు అయిన 15000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఈ ఏడాది జనవరి లోనే నమోదు 
  • ఈ ఎండా కాలంలో 17000 మెగావాట్లకు చేరుతుందని ముందస్తు అంచనా
  • విద్యుత్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి
  • దక్షిణ డిస్కం లో జరిగిన సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రానున్న ఎండాకాలం, యాసంగిలో మరింత విద్యుత్ డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా  ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. . రానున్న ఎండ కాలంలో 17వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.యాసంగి, రానున్న ఎండాకాలంలో పెరగనున్న డిమాండ్ కు తగ్గట్టు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు చేపట్టిన ఏర్పాట్లపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ప్రధాన కార్యాలయం లో సుల్తానియా  అధ్యక్షతన, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్శ్రీ ముషారఫ్ ఫరూఖితో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పెరగనున్న డిమాండ్ కు తగ్గట్టు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు చేపట్టిన ఏర్పాట్లపైశనివారం  దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ప్రధాన కార్యాలయం లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ,  గత ఏడాది జనవరి లో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా  ఈ సంవత్సరం జనవరిలో 31 న రికార్డు స్థాయిలో 15,205 మెగావాట్లుగా నమోదయ్యిందన్నారు. దక్షిణ డిస్కం పరిధిలో పీక్ డిమాండ్ 8,679 మెగావాట్లు కాగా ఈ సారి 9,589 మెగావాట్లుగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పీక్ డిమాండ్ 3018 మెగావాట్లు కాగా ఈ సారి 3334 మెగావాట్లుగా నమోదయ్యిందన్నారు. గత ఏడాది జనవరితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరి లోనే పీక్ డిమాండ్ 10శాతం అధికంగా పెరిగిందన్నారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక విద్యుత్ డిమాండ్ గత సంవత్సరం మార్చి 8వ తేదీన 15,623 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యింది. ఈ సారి పీక్ డిమాండ్ 17వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు.  దక్షిణ డిస్కం లో 10,000  మెగావాట్లకు, అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం 5,000 మెగావాట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 
సీనియర్ ఇంజినీర్లను ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించామని, విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912 ను బలోపేతం చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, విద్యుత్ సంస్థల్లో పని చేసే ప్రతి ఉద్యోగి మరింత అప్రమత్తంగా ఉంటూ సరఫరా విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దక్షిణ డిస్కం డైరెక్టర్లు  నర్సింహులు , నంద కుమార్,  సాయి బాబా,  సుధా మాధురి, చీఫ్ ఇంజినీర్లు  పాండ్య,  బాల స్వామి,  ఆనంద్,  నరసింహ స్వామి,  శివాజీ,  చక్రపాణి,  కామేష్,  ప్రభాకర్ ఆపరేషన్ ఇతర విభాగాల సూపెరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.