ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గాంధీనగర్‌లో చాలా కాలంగా పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త కుప్పలు, కంప చెట్లు స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు కౌన్సిలర్ మెంట రమణ నగేష్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.కౌన్సిలర్ మెంట రమణ నగేష్ స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని, డోజర్ పిలిపించి తన పర్యవేక్షణలోనే పేరుకుపోయిన చెత్త కుప్పలు,కంప చెట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకున్నారు. పనులు వేగంగా, సమర్థవంతంగా పూర్తి అయ్యేలా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ కిరణ్ కూడా పాల్గొని పనుల నిర్వహణను సమన్వయం చేశారు. గాంధీనగర్ కాలనీలో పరిశుభ్రత నెలకొని దుర్వాసన దోమల సమస్యలు గణనీయంగా తగ్గి స్థానిక ప్రజలకు ఉపశమనం లభించిందని కౌన్సిలర్ మెంట రమణ నగేష్ ను కాలనీవాసులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడి మహేష్, మహమ్మద్ మోయిజ్, మెంట నరసింహ తదితరులు పాల్గొని సహకారం అందించారు