Take a fresh look at your lifestyle.

AI డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ల నియామకం

ముద్ర విలేఖరి, నడిగూడెం: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ టెక్నాలజీ విస్తరణకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య గారు ప్రతి జిల్లాకు ఒక ఆధ్యాపకుడిని, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ను జిల్లా AI కో ఆర్డినేటర్స్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాకు నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కొల్లు శ్రీనివాస్, నెరెడుచర్ల కళాశాల సీనియర్ అసిస్టెంట్ భూక్యా అన్వేష్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, నడిగూడెం కళాశాల ప్రిన్సిపాల్ విజయ నాయక్ అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.