- పట్టించుకోని పోలీసు యంత్రాంగం.
- అమాయక ప్రజల పైన ఫైన్లు విధించడమే పోలీసుల డ్యూటీ గా మారిన సంఘటన.
ముద్ర, మిరుదొడ్డి: వరుస దొంగతనాలతో గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు దొంగతనాలు జరగడంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంతో పాటు ,పలు గ్రామాల్లో వరుస దొంగతనాలు రైతులకు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాక్టర్ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్తున్నప్పటికి పట్టించుకొని పోలీసులు. గ్రామానికి చెందిన గూళ్ల చంద్రయ్య, గూళ్ల కుమార్ కు చెందిన మోటార్ తో పాటు ట్రాక్టర్ కేజీ వీల్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. హబ్సిపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డికి చెందిన ట్రాక్టర్ పనిముట్లు దొంగలు రాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్ద నుండి ఎత్తుకెళ్లడం జరిగిందని బాధితుడు వాపోయారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ప్రతిరోజు పోలీసులు, వాహనదారుల పై ఫైన్ లు వేస్తున్న శ్రద్ధ దొంగతనాలు చేస్తున్న వారిని పట్టుకోవడం లో ఎందుకు లేదనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.వారం రోజుల వ్యవధిలో గ్రామంలో రెండుసార్లు దొంగతనాలు జరగడంతో వ్యవసాయ పొలాల వద్ద పనిముట్లు ఉంచడానికి రైతులు జంకుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసుల తీరు మారేనా అంటే వేచి చూడాల్సిందే.