ముద్ర, శేరిలింగంపల్లి:
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కాలనీలో పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మరియు జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ. అడ్డగుట్ట సొసైటీ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లను ఆక్రమించి, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా వ్యాపారాలు నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, దీంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీకి కాలనీవాసులు పలుమార్లు చైర్మన్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ మంగళవారం స్వయంగా రంగంలోకి దిగి, రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులు, షాపులను అధికారులతో కలిసి తొలగించారు. ఈ చర్యతో అడ్డగుట్ట సొసైటీ మహిళలు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆరెకపూడి గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“వ్యాపారం చేసుకోవడం ఎవరికీ నిషేధం కాదు. కానీ ఇతర ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా షాపులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ప్రజా సమస్యలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు కొనసాగుతాయి” చైర్మన్ గాంధీ స్పష్టం చేశారు. అడగుట్ట కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగినది అని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, ఏ చిన్న సమస్య అయిన కార్పొరేటర్ దృష్టికి గాని, తన దృష్టికి గాని తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు